బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ .. ‘జైలర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరాయిగా రాజా

-

కోలీవుడ్​ సూపర్​ స్టార్​ రజనీకాంత్- నెల్సన్​ దిలీప్​ కుమార్ కాంబోలో విడుదలైన లేటెస్ట్ మూవీ ‘జైలర్’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం తమిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నీరాజనం పడుతున్నారు. సూమారు 7000 స్క్రీన్‌లపై గురువారం గ్రాండ్​గా రిలీజైన ఈ మూవీ అద్భుతమైన ఓపెనింగ్‌తో బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కాగా.. తెలుగులోనూ తొలిరోజు కలెక్షన్స్​ అంచ‌నాల‌కు మించి రాబ‌ట్టింది.

తెలుగులో రెండు రాష్టాల్లో కలిపి ఈ సినిమా రూ.13 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, ఏడు కోట్ల‌కుపైగా షేర్‌ను రాబ‌ట్టింది. తెలుగులో రిలీజైన ర‌జ‌నీకాంత్ డ‌బ్బింగ్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లను రాబ‌ట్టిన రెండో సినిమాగా చరిత్రకెక్కింది. ఓ ప్రముఖ సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ‘జైలర్’ సినిమా ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి తొలి పోజు రూ. 44.50 కోట్లు నెట్​ వసూలు చేసిందట. ఈ క్రమలో తొలిరోజు ఈ సినిమా రూ.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్​ వర్గాల టాక్​.

Read more RELATED
Recommended to you

Latest news