అమెజాన్ ప్రైమ్​లో ‘జైలర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

ఆగస్టు నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన చిత్రం జైలర్. తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసింది. రికార్డులు బ్రేక్ చేస్తూ హిస్టరీ క్రియేట్ చేసింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్​కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్​లాల్, మిర్నా మీనన్, తమన్నా భాటియా కీలక పాత్రల్లో నటించారు.

ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తలైవా అభిమానులంతా ఎదురుచూశారు. ఆగస్టు 10న రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా సెప్టెంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వస్తోంది. ఇక ‘జైలర్‌’ ఇప్పటి వరకూ రూ.600కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. అయితే ఈ వసూళ్ల పరంపర ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున జైలర్ మూవీని ఇప్పుడిప్పుడే ఓటీటీలోకి తీసుకురామని ఇటీవల డైరెక్టర్ చెప్పారు. కానీ ఇంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news