రామ్చరణ్ తో జాన్వీకపూర్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది

-

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే టాలీవుడ్లో ఈ భామకు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ దేవరలో నటిస్తున్న జాన్వీ ఇప్పుడు రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కొంత కాలంగా రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్ అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. RC16 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్న తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన టీమ్‌.. ప్రాజెక్ట్‌లోకి స్వాగతం పలికింది. ఇది తెలుగులో జాన్వీకు రెండో సినిమా కానుంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రానుంది. మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news