భారత్లో తొలి అండర్వాటర్ మెట్రో రైలు ప్రారంభం

-

దేశంలో మెుట్టమెుదటి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్‌గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కోల్‌కతా ఈస్ట్‌ వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద హుగ్లీ నది దిగువన ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ అండర్‌ వాటర్ మెట్రో టన్నెల్‌ హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లనాడె స్టేషన్ మధ్యలో ఉంది.

అండర్ వాటర్ మెట్రో రైలు విశేషాలు  

520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది.

సొరంగ అంతర్గత అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లగా ఉంది.

ఈ సొరంగమార్గం నదీగర్భానికి 13 మీటర్ల దిగువన, భూమిలోపలికి 33 మీటర్ల దిగువన ఉంది.

మెట్రో మార్గంతో ప్రస్తుతం గంటన్నర పట్టే ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గుతుంది.

ఈ కారిడార్ల పరిధిలో ఎస్‌ప్లనాడె, మహాకారణ్‌, హావ్‌ డా, హావ్‌ డా మైదాన్‌ వంటి ముఖ్యమైన స్టేషన్లున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news