టాలీవుడ్ యంగ్ హీరోతో జాన్వీక‌పూర్ రొమాన్స్‌..!

1661

అల‌నాటి అందాల తార శ్రీదేవి ఎప్ప‌ట‌కి ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో మిగిలిపోయే ఉంటారు. మ‌న సినిమా చ‌రిత్ర‌లో శ్రీదేవిది ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా లెక్క‌లేన‌న్ని స్మృతులు ఆమె మ‌న‌కు మిగిల్చారు. ఇక శ్రీదేవి ఇద్ద‌రు కుమార్తెల్లో పెద్ద కుమార్తె జాహ్న‌వీ క‌పూర్ ఇప్ప‌టికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Janhvi kapoor Romance With Young Tollywood Hero
Janhvi kapoor Romance With Young Tollywood Hero

శ్రీదేవి ఇండియ‌న్ అందాల తార అయినా ఆమె ప్ర‌స్థానం మాత్రం తెలుగు నుంచే ప్రారంభ‌మైంది. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఆమెను మ‌హారాణిని చేసింది తెలుగు వాళ్లే. ఇప్పుడు ఆమె కుమార్తెను కూడా తెలుగులో చూసే ల‌క్కీ ఛాన్స్ మ‌న ప్రేక్ష‌కుల‌కు రాబోతుంది. ఆ అవ‌కాశం ఇస్తోంది ఎవ‌రో కాదు టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.

ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఎట్ట‌కేల‌కు హిట్ కొట్టి ఫామ్లోకి వ‌చ్చిన పూరి ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో త‌న నెక్ట్స్ సినిమాను ప‌ట్టాలెక్కిం చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇప్ప‌టికే నిర్మాత ఛార్మీ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేసింది. ఈ సినిమాను త్వ‌ర‌లోనే పూరి ప‌ట్టాలెక్కించేయ‌నున్నాడు.

ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న జాహ్న‌వీ క‌పూర్‌ను హీరోయిన్‌గా న‌టింప జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. పూరి త్వ‌ర‌లోనే ముంబై వెళ్లి బోనీకపూర్‌ను క‌లిసి జాహ్న‌వికి స్టోరీ నెరేట్ చేసి ఒప్పించేందుకు వెళుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా జాహ్న‌వి తెలుగు స్క్రీన్ మీద క‌నిపిస్తే ఆ మాజానే వేరు క‌దా..! ఇక విజ‌య్‌తో జాహ్న‌వి రొమాన్స్ ఎలా ఉంటుందో ? కూడా ఆస‌క్తిక‌ర‌మే.