రామ్ చ‌ర‌ణ్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన జ‌పాన్ ఫ్యాన్స్‌!

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ Ram Charan తండ్రి చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ప‌రిచ‌యం అయినా కూడా త‌న న‌ట‌న‌తో, డ్యాన్సుల‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇండ‌స్ట్రీలో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్ర‌స్తుతం ఆయ‌న మొత్తం ప్యాన్ ఇండియ‌న్ మూవీల్లోనే చేస్తూ నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు.

రామ్ చ‌ర‌ణ్ /Ram Charan
రామ్ చ‌ర‌ణ్ /Ram Charan

అయితే రామ్ చ‌ర‌ణ్‌కు మగధీర సినిమాతో జపాన్ దేశ అభిమానులు పెరిగారు. ఈ మూవీతోనే ఆయ‌న వారికి మరింత దగ్గరయ్యిపోయాడ‌ని చెప్పాలి. ఇక ఆ నాటి నుంచి ఇప్ప‌టి దాకా చాలా మంది ఫ్యాన్స్ ఆయ‌న‌కు త‌మ అభిమానాన్ని చూపిస్తూ స్పెష‌ల్ గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మ‌రో జపాన్ కపుల్ మాత్రం చరణ్ ఎనర్జిటిక్ రంగస్థలం సాంగ్ తో దుమ్ము లేపారు.

ఆ మూవీలోని జిగేలు రాణి పాట‌లో అదిరిపోయే స్టెప్పులు వేసి చర‌ణ్‌కు గిఫ్ట్ ఇచ్చారు. రామ్ చ‌ర‌ణ్‌, పూజాహెగ్దే చేసిన‌ట్టే డ్యాన్సు స్టెప్పులు వేసి వారంతా అదరగొట్టేశారు. ప్ర‌స్తుతం ఇదే వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెంచేసింది. ఇక ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు ఆచార్య మూవీల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవి రెండూ కూడా భారీ మల్టీస్టారర్ అనే విష‌యం విదిత‌మే.

Read more RELATED
Recommended to you

Latest news