రామ్ చ‌ర‌ణ్‌ న్యూ లుక్.. ఫ్యాన్స్ షాక్..!

-

నిన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ బర్త్‌ డే సందర్బంగా మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్ చేశారు‌. ఈ వీడియోలో… త్వరలోనే అందరం మళ్లీ కలిసి పని చేసుకునే రోజులు వస్తాయని, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చరణ్. ఇందులో చ‌ర‌ణ్ మాస్ లుక్‌ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. చ‌ర‌ణ్ తాజా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ ‌కి లాక్‌ డౌన్ వ‌ల‌న బ్రేక్ ప‌డింది.

దీంతో గ‌త మూడు నెల‌లుగా హీరోలంతా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న షూటింగ్ కోసం చ‌ర‌ణ్ స‌న్న‌ద్ద‌మ‌వుతుండగా, ఆయ‌న తాజా లుక్ అభిమానుల‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌ డే సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామ‌రాజు పాత్రకి సంబంధించి లుక్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news