‘జవాన్’ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్

-

బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్.. లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన సినిమా ‘జవాన్’. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ రానే వచ్చింది. సినిమా ప్రమోషన్స్​లో ఫుల్​ జోరుగా ఉన్న మూవీ టీమ్​.. తాజాగా 2:45 నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్​ చేసింది​. అదిరిపోయే డైలాగ్​లు, యాక్షన్ సన్నివేశాలతో, కళ్లు చెదిరే విజువల్స్​తో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది ఈ వీడియో. పవర్ ఫుల్​ యాక్షన్​తో ఈ చిత్రం ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. తాజా వీడియోలో విజయ్​ సేతుపతి విలన్​ లుక్​ను కూడా రివీల్​ చేశారు. ఆయుధాల స్మగ్లర్​గా సేతుపతిని చూపించారు.

ఈ సినిమాలో దీపికా పదుకొణె స్పెషల్ రోల్​లో కనిపించనుంది. ప్రియమణి కూడా పోలీస్​ ఆఫీసర్​గా ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది. అదిరిపోయే బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్​తో షారుక్​ను హై రేంజ్​లో ఎలివేట్ చేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నారు. షారుక్​ భార్య గౌరీ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news