వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్తట్విస్ట్

-

విశాఖపట్నంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితిసాహ కేసు సంచలనం రేపుతుంది. జూలై 14 వ తేదీన భవనం పై నుండి కిందపడి రితీసాహ మృతి చెందింది. అయితే వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో తాజాగా కొత్తట్విస్ట్ తెరపైకి వచ్చింది. విద్యార్థిని రితి సాహ ఆసుపత్రిలో ఉన్న వీడియో బయటపడింది. హాస్టల్ బిల్డింగ్ నుంచి కింద పడిన తరువాత బాలికను ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చింది యాజమాన్యం. దీంతో బాలిక తల్లదండ్రుల ఆరోపణలకు రోజు రోజుకి బలం పెరుగుతోంది.

బాలిక మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. బాలిక ఒంటి పై బలమైన గాయాలు కనిపించలేదు. సీసీ ఫుటేజ్ లో టైమింగ్ మొదటినుండి మిస్టరీగా మారింది. ఇప్పుడు రీతు ఒంటిపై బలమైన గాయాలు లేక పోవడం, మృతికి దారి తీసిన కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో యాజమాన్యంకి ఏం చెప్పిందో అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. విశాఖలో ఇప్పటికే వెస్ట్ బెంగాల్ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news