తెలంగాణలో 8.79% భూగర్భ జలాల పెరుగుదల

-

తెలంగాణలో పుడమి తల్లి కడుపు చల్లగా మారుతోంది. ఏడాది ఏడాదికి రాష్ట్రంలో భూగర్భజలాలు పెరుగుతతున్నాయి. తెలంగాణలో 8.79% భూగర్భ జలాలు పెరిగినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ తెలిపింది. ‘నేషనల్‌ కంపైలేషన్‌ ఆన్‌ డైనమిక్‌ గ్రౌండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఆఫ్‌ ఇండియా – 2023’ నివేదికలో వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.62% పెరిగాయి. గత ఏడాది 437.6 శతకోటి ఘనపు మీటర్ల (బీసీఎంల) మేర ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 449.08 బీసీఎంలకు చేరాయి. అంటే నికరంగా 11.48 శతకోటి ఘనపు మీటర్ల మేర పెరిగినట్లన్నమాట.

దేశంలో అత్యధికంగా తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, గుజరాత్‌, బిహార్‌లలో భూగర్భ జలాలు పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. ఇక వాడుకోదగ్గ జలాలు 309.08 బీసీఎంల నుంచి 407.21 బీసీఎంలకు పెరిగినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా భూగర్భజలాల వాడకం 2022-2023 మధ్యకాలంలో 239.16 బీసీఎంల నుంచి 241.34 బీసీఎంలకు పెరిగినా, తోడుకొని వాడుకొనే నీటి నిష్పత్తి మాత్రం 60.08% నుంచి 59.26%కి తగ్గినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news