NTR 30 : ప్రస్టేషన్ లో ఉన్న జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.!

-

జూ ఎన్టీఆర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇప్పటికీ తెలుగు సినిమా హీరోలలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే చాలా మంది జూ ఎన్టీఆర్ పేరే చెబుతారు. రీసెంట్ గా రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో తన నటన తో  భారత దేశంలో లోనే కాక ,హాలీవుడ్ వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచాడు.కాని జూ ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అప్డేట్ లేక ఫ్యాన్స్ చాలా నిరుస్తాహం గా వున్నారు. తాను చేయబోయే చిత్రం 30 వది కావడంతో నందమూరి అభిమానులే కాదు, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు చూస్తున్నారు.ఇక ఈ సినిమా కథ  మెడికల్ మాఫియా చూట్టూ తిరుగుతుంది అని తెలుస్తోంది. ఈ సినిమాలో  ఎన్టీఆర్ పలికే డైలాగ్స్ హైలైట్ గా ఉండబోతున్నాయి అని అంటున్నారు.  ఈ చిత్రాన్ని త్వరగా  సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.. కాక పోతే ఈ అప్డేట్ పై జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అంత లేట్ అంటే ఎలా అని చాలా కోపంగా ఉన్నారట. ఇదే కోపాన్ని కామెంట్స్ గా పెడుతున్నారు.

ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన సెట్‌ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. శంషాబాద్‌లో ప్రాంతంలో ఓ సెట్‌ వేస్తున్నారట. అయితే సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందనే టాక్‌ ఆ మధ్య వినిపించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచిగానీ, లేదంటే మార్చి మొదటి వారం నుంచి గానీ చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేసినట్టు టాక్. ఈ సినిమా షూటింగ్‌కి ఆల్మోస్ట్ ఏడాదిపాటు ఆలస్యమైంది. దీంతో ఇక గ్యాప్‌ లేకుండా చిత్రీకరించేందుకు దర్శకుడు కొరటాల ప్లాన్‌ చేశారని తెలుస్తుంది. హైదరాబాద్‌, గోవాలో షూటింగ్‌ జరిపే అవకాశం ఉందని అంటున్నారు

 

 

Read more RELATED
Recommended to you

Latest news