జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

-

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. బెయిల్ పిటిషన్ పై ఈనెల 14 కు వాయిదా వేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక హోదా కోర్టు తీర్పును వెలువరించింది.

అక్టోబర్ 14న తీర్పు వెలువడనుంది. అప్పటివరకు జానీ మాస్టర్ చెంచల్ గూడా సెంట్రల్ జైలులో రిమాండ్ ను అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల తనకు ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు వచ్చిందని, అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత సోమవారం రంగారెడ్డి జిల్లా ఫోక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్.

వాదనలు విన్న కోర్టు ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బేయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కానీ జానీ మాస్టర్ అందుకోబోయే పురస్కారాన్ని రద్దు చేసినట్లు ఆయనకు తెలియడంతో.. ఆయనకి మంజూరైన మద్యంతర బెయిల్ ని వినియోగించుకోబోనని కోర్టులో మెమో దాఖలు చేశారు.

వచ్చిన మద్యంతర బెయిల్ పిటిషన్ ని వెనక్కి తీసుకున్న జానీ మాస్టర్ తనకు రెగ్యులర్ బెయిల్ కావలసిందిగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పుని ఈ నెల 14 కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news