హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అనూహ్య విజయం సాధించి హైట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి బీజేపీ ఘనవిజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాలలో 48 స్థానాలలో బిజెపి విజయం సాధించింది.
కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఈవీఎంలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో ఈవీఎంలతోనే గెలిచారని గుర్తు చేశారు. హర్యానాలో బిజెపి మళ్ళీ గెలవడానికి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని ఆరోపించారు అసదుద్దీన్.
బిజెపిపై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈవీఎంల ను నిందించడం పరిపాటిగా మారిందని.. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో బిజెపి లాభపడిందన్నారు. ఎన్నికల పోరులో బిజెపికి కాస్త అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటుందని అన్నారు.