తండ్రితో ఫైట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్!

-

జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తుంటాడు. తన పెద్ద కొడుకు అభయ్ రామ్, తన చిన్న కొడుకు భార్గవ్ రామ్ గురించి అప్పుడప్పుడు తన అభిమానులకు చెబుతుంటాడు ఎన్టీఆర్. అయితే.. రీసెంట్ గా తన పెద్ద కొడుకు అభయ్ రామ్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు ఎన్టీఆర్.

ఆ వీడియోలో తారక్ కు అభయ్ రామ్ పంచులు ఇస్తుంటాడు. ఆ వీడియోకు భలే క్యాప్సన్ పెట్టాడు ఎన్టీఆర్. నీ కొడుకుకు నువ్వు పంచ్ బ్యాగ్ అయితే ఇలాగే ఉంటది అంటూ కరాటే కిడ్ హ్యాష్ టాగ్ తో క్యాప్సన్ పెట్టి వీడియో షేర్ చేశాడు ఎన్టీఆర్. ఇక.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక.. తారక్ సినిమాల విషయానికి వస్తే.. అరవింత సమేత వీర రాఘవ సినిమా కోసం ప్రస్తుతం బిజీబీజీగా గడుపుతున్నాడు. దసరాకు విడుదల కానున్న ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నది. పూజా హెగ్డే కథానాయక. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version