కైకాల స‌త్య‌నారాయణ :సృహ‌ లో ఉన్నా.. విష‌మం గానే ఆరోగ్యం

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య నారాయ‌ణ ఆరోగ్యం ఇంకా విష‌మం గానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆది వారం రాత్రి కైకాల స‌త్య నారాయ‌ణ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. కాగ కైకాల సత్య నారాయ‌ణ అనారోగ్యంతో హైద‌రాబాద్ లోని అపోలో ఆస్ప‌త్రి లో చేరారు. ఆయ‌న కు వెంటి లేట‌ర్ పై నే చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యం అత్యంత విష‌మం గా ఉంద‌ని హెల్త్ బులిటెన్ లో వైద్యులు వెల్ల‌డించారు.

కైకాల కు బీపీ లెవ‌ల్స్ చాలా త‌క్కువ‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. కైకాల స‌త్య నారాయ‌ణ ను ఐసీయూ లో ఉంచి వెంటి లేట‌ర్ తో మెరుగైన చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ని త‌మ‌ వైద్యులు ఎప్ప‌టి క‌ప్పుడు ప‌రీశిలిసిస్తున్నార‌ని అపోల్ ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించారు. కాగ కైకాల‌ స‌త్య నారాయ‌ణ ఆరోగ్యం సినిమా అభిమానులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. సెల‌బ్రెటీలు కూడా కైకాల త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ట‌ర్ ద్వారా కైకాల త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్నారు.