Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం..

-

Kaikala Satyanarayana: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ప్రమాదవశాత్తు ఇంట్లో కాలు జారిపడగా… సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ లో ఆందోళన నెలకొంది. ప్రేక్ష‌కులు కూడా ఆందోళ‌న ప‌డుతున్నారు.

కైకాల సత్యనారాయణ న‌టప్రస్థానం ఎందరో న‌టుల‌కు ఆద‌ర్శ‌ప్రాయం. ఆయన ఆరోగ్యం బాగాలేని రోజుల్లో సినిమాల మీద మ‌క్కువ‌తో చిన్న పాత్రలతో అయినా న‌టించేవారు. ఆయ‌న సీనియర్ ఎన్‌టీఆర్‌కు ఎన్నో సినిమాలకు డూప్‌గా నటించారు. యముడి పాత్రకు ఆయ‌న‌కు విపరీతమైన క్రేజ్ లభించింది. అయితే.. గత కొంతకాలంగా కైకాల ఆరోగ్యం నిలకడగా లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కోసం కొన్నిరోజుల క్రితం చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు కూడా. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news