కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్‌..

-

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. వయసు పెరుగుతున్న కొద్ది మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కానీ.. నిర్మాతగా ఈ సినిమా ఆయనకి నష్టాలు తెచ్చిపెట్టడమే కాకుండా కొన్ని విమర్శలను కూడా మోసుకొచ్చింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున తదుపరి సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. నూతన దర్శకుడు సాల్మన్ చెప్పిన కథ నచ్చడంతో, పోలీస్ ఆఫీసర్ గా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి కాజల్ అయితేనే బెటర్ అనుకుని ఆమెను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని అంటున్నారు. గతంలో చరణ్ జోడీకట్టిన కాజల్ ఆ తరువాత చిరంజీవి సరసన మెరిసింది. అలాగే ఇంతకుముందు చైతూతో కలిసి ‘దడ’ చేసిన కాజల్, ఇప్పుడు నాగార్జునతో చేయనుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news