ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు…? బొంబాయి హైకోర్ట్ ఏం చెప్పింది…?

-

గురువారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. థాకరే కుటుంబం నుంచి ప్రభుత్వ పదవి చేపడుతున్న తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. దీనితో శివాజీ పార్క్ లో శివసైనికులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి భారీగా ఆహ్వానాలు కూడా పంపించినట్టు సమాచారం. అతిరధ మహారధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని శివసేన భావిస్తుంది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధి ఈ కార్యక్రమానికి వస్తారని భావించినా… వాళ్ళు సుముఖంగా లేరని సమాచారం. సోనియా గాంధీకి ఇష్టం లేదని శరద్ పవార్ ఒత్తిడి మేరకే ఈ పొత్తుకి ఒప్పుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే… శివాజీ పార్క్ లో జరగబోయే ఈ కార్యక్రమానికి భద్రతా పరమైన ఆందోళనలు ఆ రాష్ట్ర హైకోర్ట్ వ్యక్తం చేసింది. జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, ఆర్‌ఐ చాగ్లా డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. “రేపటి వేడుక గురించి మేము ఏమీ చెప్పదలచుకోలేదు … అవాంఛనీయమైనవి ఏమీ జరగకూడదని మేము ప్రార్థిస్తున్నా౦”

అంటూ బెంచ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు అనేక అనుమానాలకు వేదికగా మారింది. శివాజీ పార్క్ లో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోవచ్చు అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు… తొక్కిసలాట సహా… బాంబు పేలుళ్లు కూడా జరిగే అవకాశం ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. భారీగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా పలువురు సూచిస్తున్నారు. రాజకీయ కుట్రలు కూడా దీని వెనుక ఉండవచ్చని పలువురు అంటున్నారు. ఇక హైకోర్ట్ మరో కీలక సూచన చేసింది… ఇలాంటి కార్యక్రమాలకు మైదాన ప్రాంతాలను వినియోగించుకోవడం మంచిదని సూచించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news