ఆ సినిమాలో గెస్ట్ రోల్‌లో రానున్న కాజ‌ల్ ఆగ‌ర్వాల్‌..

-

అగ్ర కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ప్ర‌స్తుతం ఓ సినిమాలో గెస్ట్ రోల్‌లో రానుంది. కాజల్ అగర్వాల్‌, ప్రభాస్‌ది క్రేజీ జోడి. ఈ ఇద్దరు కలిసి నటించిన రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ప్ర‌స్తుతం ప్రభాస్ ‘జాన్’ సినిమా చేస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆ మధ్య ఇటలీలో కొంతవరకూ షూటింగ్ చేసుకుని వచ్చారు. తదుపరి షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. యూరప్ నేపథ్యానికి సంబంధించిన సెట్స్ ను సిద్ధం చేస్తున్నారు.

ఈ సెట్స్ సిద్ధం కాగానే మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే జరగనుంది. 1970 పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతిథి పాత్రలో కాజల్ కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో ప్రభాస్ జోడిగా కాజల్ ‘డార్లింగ్’.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా చేసిన సంగతి తెలిసందే. ఆయనతోగల సాన్నిహిత్యం కారణంగా .. ఈ ప్రాజెక్టుకి గల క్రేజ్ వలన గెస్ట్ రోల్‌కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news