టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

సుదీర్ఘ కాలం నుంచి కథానాయికగా నటిస్తూ వచ్చిన కాజల్ 2020 లాక్ డౌన్ సమయంలో వ్యాపార వేత్త , తన స్నేహితుడు గౌతమ్ కీచ్లు ని వివాహం చేసుకున్న తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది.

కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలకు దూరంగా కుటుంబం తో ముంబైలో గడుపుతున్న ఈ పంజాబీ భామ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే.

తాజాగా కాజల్ భర్త గౌతమ్ తన భార్య మరియు పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ లో ఇదే మా కుటుంబం అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెటిజన్లను ఈ ఫోటో బాగా ఆకట్టుకుంటుంది.
