మేకప్ మనల్ని బయటికి మాత్రమే అందంగా చూపిస్తుంది. అంతేకానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా? మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉంది. అదే రియల్ బ్యూటీ.. అంటోంది కాజల్..
‘మనం శరీర అందాన్ని ఆరాధించే ప్రపంచంలో జీవిస్తున్నాం. అందంగా కనిపించడం కోసం కాస్మోటిక్స్ కి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నాం. కానీ అసలు అందం మన ఆత్మ విశ్వాసంలో ఉంది. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది’ అని అంటోంది కాజల్. తెలుగు పరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కాజల్ ఉన్నట్టుండి అభిమానులకు షాక్ ఇచ్చింది. తన అసలు స్వ‘రూపం’ చూపించింది.
మేకప్ లేకుండా డీ గ్లామరస్ ఫొటోలకు పోజులిచ్చి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అంతే కాదు ఈ సందర్భంగా భారీ సందేశాన్నిచ్చింది. ‘మేకప్ మనల్ని బయటికి మాత్రమే అందంగా చూపిస్తుంది. అంతేకానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా? మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉంది. అదే రియల్ బ్యూటీ. అందం అంటే మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించుకోవడం. అయితే ప్రస్తుతం మనం శారీరక ఆకర్షణ కోసం వెతికే ప్రపంచంలో ఉన్నాం. అందం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఖరీదైన కాస్మోటిక్ ఉత్పత్తుల కోసం భారీగా డబ్బు వెచ్చిస్తున్నాం. మన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇది ఒక్క సినిమాల్లోనే కాదు, అన్ని రంగాల్లోనూ ఉంది. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడంలోనే నిజమైన ఆనందం, ఆత్వవిశ్వాసం ఉంది’ అని తెలిపారు. ఇప్పుడు కాజల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆమె ఇచ్చిన సందేశానికి నెటిజన్లు, సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. కాజల్ ధైర్యానికి మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉన్నట్టుండి కాజల్ ఎందుకిలా చెబుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. తన జీవితంలో ఎలాంటి మార్పు చోటుచేసుకుందనే బెంగలో అభిమానులున్నారు. అయితే కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ విషయాన్ని చెబితే, తాను దిగిన ఫొటోలు మరో విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారల జీవితాలు తెరపై మాత్రమే అందంగా ఉంటాయి. తెర వెనుక ఎన్నో ఒడిదుడుకులతో సాగుతాయని, పైకి కనిపించేంత అందంగా వారి జీవితాలుండవని చెప్పకనే చెబుతుంది. ఈ విషయం కాజల్ చెప్పినా, చెప్పకపోయినా ఇదే నిజమని సినీ వర్గాలకు తెలిసిన విషయమే.
చిత్ర పరిశ్రమ అంటేనే అదో కలర్‌ఫుల్ ప్రపంచం. కంటెంట్ కంటే, హీరోల ఇమేజ్‌తో, కథానాయిక అందాలతోనే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. అందుకే సినీ పరిశ్రమలో ఎప్పటికప్పడు కొత్త అందాలను దిగుమతి చేసుకుంటూనే ఉంటారు. మరి వారి అందాల వెనకున్నఅసలు రూపం ఏంటో కాజల్ ఇప్పుడు బయట పెట్టి శభాష్ అనిపించుకుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల ‘సీత’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన కాజల్ ఇందులో సీతగా తన నటన విశ్వరూపం చూపించింది. కానీ ఈ సినిమా ఘోర పరాభవం చెందింది. ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ‘రణరంగం’లో, తమిళంలో కమల్ హాసన్ తో కలిసి ‘భారతీయుడు 2’ చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు బాలీవుడ్ చిత్రం ‘క్వీన్’ గా రీమేక్ తమిళంలో రూపొందిన ‘పారిస్‌పారిస్’ నటించింది. ఇది విడుదల కావాల్సి ఉంది.