హీరోయిన్ కాజల్ పెళ్లీ ఫిక్స్..వరుడు ఎవరంటే…?

-

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ కాజల్‌ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనుంది. ఇప్పటికే ఆమె పెళ్లి వార్తల పై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో దీని పై ఓ క్లారిటి వచ్చిందని తెలుస్తుంది.కాజల్‌ అగర్వాల్‌ ముంబైకి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ బిజినెస్ మెన్ అయిన గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకోనుందని తెలుస్తుంది. ఆమె తల్లి దండ్రులు ఈ సంబంధం కుదిర్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే గౌతమ్ తో ఎంగేజ్ మెంట్ పూర్తయిందని ముంబైలో వీరి వివాహం జరగనుందని తెలుస్తుంది. అయితే ఈ వార్తల పై కాజల్‌ సైలెంట్‌గానే ఉండటం విశేషం. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం స్టార్‌ హీరోలైన కమల్‌ హాసన్‌, చిరంజీవి వంటి వారి సరసన కాజల్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version