భ‌ర్త‌తో క‌లిసి రొమాంటిక్ రోడ్ ట్రిప్ చేసిన కాజ‌ల్‌!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్‌ అగ‌ర్వాల్ బ్యాచిల‌ర్ లైఫ్ కు పులిస్టాప్ పెట్టి త‌న చిన్న‌నాటి ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూను వివాహం చేసుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దాదాపు ఏడేళ్ల‌కు పైగా అతనితో రిలేష‌న్‌లో ఉన్న కాజల్ రీసెంట్ గా ఆయ‌న్ను వివాహం చేసుకుంది. ఇక అప్ప‌టి నుంచి ఎక్క‌డ చూసినా వీరి ఫొటోలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో ఈ జంట గురించే ఎక్కువ‌గా వార్త‌లు వ‌స్తున్నాయి.

కాజ‌ల్‌/Kajal Aggarwal
కాజ‌ల్‌/Kajal Aggarwal

కాగా ఇటీవల ముంబై వీధుల్లో ఆకస్మిక మార్పుతో పాటు వర్షాల కారణంగా ఈ జంట రోడ్డు ట్రిప్‌కు వెళ్లింది. కాజల్ త‌న భర్త గౌతమ్ తమ కారులో ఈ లాంగ్‌ డ్రైవ్ కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా వారు కారులో దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ ఫొటో వారిద్ద‌రూ కారులో సెల్ఫీ తీసుకున్నట్టు ఉంది.

అయితే ఈ ఫొటోను పోస్ట్ చేసిన గౌత‌మ్ కిచ్లూ జీవితంలో గొప్ప అనుభూతులు ఎల్లప్పుడూ ప్లాన్ లేకుండానే వ‌స్తాయ‌ని చెప్పాడు. అందుకు ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఆయ‌న కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ ట్రిప్ త‌మ వివాహ ప్ర‌యాణానికి మ‌రో అధ్యాయ‌మ‌ని వివ‌రించాడు. ప్ర‌స్తుతం వీరు షేర్ చేసిన ఈ ఫొటో విపరీతంగా వైర‌ల్ అవుతోంది. మ‌రి మీరూ చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news