సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. ఈ సందర్భంగా..!

-

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డిని బాడ్మింటర్ క్రీడాకారిణి పీవీ సింధు కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఆమె.. జగన్‌తో భేటీ అయ్యారు. ఆమెతో ఒలింపిక్స్ ఎంపికైన ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజినీ కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు.

సీపీ సింధుతో పాటు వీరికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను జగన్ అందజేసి విసెష్ తెలిపారు. ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలవాలని సూచించారు.అంతేకాదు విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను ఈ సందర్భంగా పీవీ సింధుకి సీఎం జగన్ అందజేశారు.

దీంతో అకాడెమీ ఏర్పాటుకు రెండెకరాల భూమి కేటాయించినందుకు సీఎం జగన్‌కు పీవీ సింధు ధన్యవాదాలు తెలిపారు.కాగా జులై 23,2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌ జరగనున్నాయి. ఈ ఒలింపిక్స్‌కు భారతదేశం తరపున పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీ ఎంపిక అయ్యారు. రజనీ (ఉమెన్స్‌ హకీ)కి ఎంపిక అయ్యారు.

బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా సీఎం జగన్‌ని ఆమె కుటుంబ సభ్యులు కలిశారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామ్‌గోపాల్ పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news