ఈ వారం థియేటర్‌లో ఆ ఒక్క సినిమానే

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్న ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌.. భారీ బడ్జెట్‌, తారాగణంతో రూపొందింది. ఈ చిత్రం జూన్‌ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ విడుదల చేస్తోంది.

ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక్క సినిమాయే విడుదలవుతోంది. కల్కిని దృష్టిలో ఉంచుకుని మిగతా సినిమాలేవీ విడుదల చేయలేదు. ఇక ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. కాశీ, కాంప్లెక్స్‌, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పురాణగాథ, పాత్రలను జత చేసి నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘కల్కి’ వంటి విజువల్‌ వండర్‌ వస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news