మే 31న ఓటీటీలోకి ‘కల్కి’ ప్రీల్యూడ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘కల్కీ 2898 AD’ సినిమా మూవీ టీమ్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. ప్రేక్షకులకు సినిమాపై ఓ అంచనా వచ్చే విధంగా ఇది వరకు చెప్పినట్లుగా ‘ప్రీ ల్యూడ్’ వీడియోలను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాకు సంబంధించి 5 ప్రీల్యూడ్ వీడియోలను రీలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మే 31వ తేదీ నుంచి ఈ వీడియోలు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. అయితే ఇవి పూర్తిగా ప్రమోషనల్ పర్పస్‌గా మాత్రమే విడుదల చేస్తున్నారు. వీటికి సినిమాకు ఎటువంటి సంబంధం లేనివని స్పష్టం చేసింది.

భైరవ (ప్రభాస్), బుజ్జి (కారు)కు సంబంధించిన టీజర్లు మాత్రమే రిలీజ్ చేసిన టీమ్ మిగతా స్టార్ల ప్రమోషన్లను కూడా ప్రిపేర్ చేస్తోంది ఈ టీమ్. ఇప్పటికే చెన్నై వీధుల్లో తిరుగుతూ బుజ్జి ఫేమస్ అయిపోయింది. ఇక ప్రిల్యూడ్స్తో పాటు మరొక గ్లింప్స్ గురించి బుధవారం కీలక అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news