మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.. కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. అయితే వీరిద్దరికి పుట్టిన పాప మాత్రం కొన్ని రోజులు కళ్యాణ్ దేవ్ దగ్గర ,మరికొన్ని రోజులు శ్రీజ దగ్గర గడుపుతూ ఉంటుంది. అయితే పాపకు తల్లిదండ్రులు ఇద్దరూ అవసరమని ఎప్పుడు తెలుసుకుంటారని అభిమానుల సైతం ఎంతో ఎదురు చూశారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ తాజాగా ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక పాప స్కూల్ కల్చర్ లో పాల్గొంటుంది.
వేదిక ముందున్న పేరెంట్స్ ని చూసి ఆ పాప చాలా ఎక్సైట్మెంట్ ఫీలవుతుంది. ఆ వీడియోని కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టారు. ఆ వీడియోకి ఒక కామెంట్ కూడా పెట్టారు. పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి .. నవిష్క, నవిత్రిలను బాగా మిస్ అవుతున్నాను అంటూ కళ్యాణ్ దేవ్ కామెంట్ చేయడం గమనార్హం. ఇకపోతే నవిష్కతో పాటు నవిత్రిని కూడా తలుచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్రీజ, కళ్యాణ్ దేవ్ లకు పుట్టిన అమ్మాయి.. నవిత్రి మాత్రం శ్రీజ మొదటి భర్త సంతానం.. వివాహం చేసుకున్నాక నవిత్రిని కూడా కళ్యాణ్ కూతురుగా భావించారు.
ఆమెతో అనుబంధం పెంచుకున్న కళ్యాణ్ దేవ్ శ్రీజ తో మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు. ఇకపోతే నవిష్క, నవిత్రి ఇద్దరు కూడా శ్రీజ వద్దే పెరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిసే అవకాశం కళ్యాణ్ దేవ్ కు లేకపోయింది. అందుకే ఈ కారణంగా తన కూతుర్లు ఇద్దరినీ తలుచుకొని కళ్యాణ్ దేవ్ ఇలా ఎమోషనల్ పోస్ట్ చేయడం అందరిని మరింత బాధకి గురి చేస్తుంది. కనీసం ఇలానైనా వీరిద్దరూ కలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.