ఇద్దరు భామలతో కళ్యాణ్ రామ్ రొమాన్స్..!

-

నందమూరి కళ్యాణ్ రాం రీసెంట్ గా 118తో సక్సెస్ అందుకున్నారు. పటాస్ తర్వాత కళ్యాణ్ రాం కొట్టిన సక్సెస్ ఇదే. ఇక ఈ సినిమా తర్వాత సొంత బ్యానర్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ లోనే కళ్యాణ్ రాం సినిమా చేస్తున్నాడు. వేణు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ తుగ్లక్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది.

ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అంటే ఒకరు రకుల్ ప్రీత్ సింగ్, మరొకరు కేథరిన్ త్రెసా అని తెలుస్తుంది. ఈమధ్య తెలుగులో కాస్త జోరు తగ్గించిన రకుల్ మళ్లీ వరుస అవకాశాలను అందుకుంటుంది. కేథరిన్ త్రెసా కూడా మళ్లీ వరుస సినిమాలు చేస్తుంది. మరి ఇద్దరు ముద్దుగుమ్మలతో నందమూరి హీరో చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news