భీష్మ సింగిల్ ఫర్ ఎవర్.. ప్రీ లుక్ అదిరింది..!

-

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం నితిన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ నితిన్ తో భీష్మ చేస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. కాని ఫైనల్ గా సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఈ ప్రీ లుక్ కూడా వెరైటీగా ఉంది.

సినిమాలో నితిన్ కు జోడీగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. భీష్మ సింగిల్ ఫర్ ఎవర్ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రీ లుక్ ఇంప్రెస్ చేయగా వెంకీ నితిన్ కు భీష్మ రూపంలో కచ్చితంగా ఓ సూపర్ హిట్ ఇచ్చేలా ఉన్నాడని నితిన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news