నటుడిగా 61 ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్…!

-

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటుడిగా 61 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 4 సంవత్సరాల వయస్సులో తన వృత్తిని ప్రారంభించిన కమల్ 1959 లో విడుదలైన కలతూర్ కన్నమ్మలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 150 కి పైగా చిత్రాలలో నటించాడు. ఇండియన్ సినిమా సాంకేతిక అంశాలలో చాలా మార్పులను తీసుకువచ్చాడు.

ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు కమల్. నాలుగేళ్ల వయసు లోనే ఆయనకు మంచి హిట్ వచ్చింది. అక్కడి నుంచి హీరోగా ఎన్నో ఎత్తు పల్లాలను కమల్ చూసారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఆయన మాత్రం తన సినీ కెరీర్ విషయంలో ఆ ప్రభావం లేకుండా సినిమాలు చేసారు. ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు కమల్. నిర్మాతగా దర్శకుడిగా కూడా ఆయన రాణించారు.

Read more RELATED
Recommended to you

Latest news