మరో అరుదైన రికార్డు సృష్టించిన కమల్ హాసన్..!

-

విలక్షణ నటుడిగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న కమలహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విశ్వ నటుడిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈయన నటుడిగా ,దర్శకుడిగా, నిర్మాతగా , డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా గత ఆరు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీకి సేవలు అందిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పిలిపించుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ఖాతాలో మరొక అవార్డు వచ్చి చేరనుంది. గత ఆరు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గాను తాజాగా జీవితకాల సాఫల్య పురస్కారం వరించింది.

ఈనెల 27వ తేదీన అబుదాబిలో జరగనున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకలలో ఆయన ఈ అవార్డును అందుకోబోతున్నారు.. ఇకపోతే సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్న కమలహాసన్ కు ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానుల సైతం తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇండియన్ 2 లో కమలహాసన్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ కీలక పాత్రలు పోషిస్తుండగా త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే పలు భాషలలో 232 కు పైగా చిత్రాలలో నటించిన ఆయన ఇటీవల తన సొంత బ్యానర్లో నిర్మించిన విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు ధనుష్ , శివ కార్తికేయన్, శింబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news