తాము సింగిల్‌గానే పోటీ చేస్తామని.. తప్పకుండా ఈసారి తెలంగాణలో అధికారం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశాన్ని జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బండి సంజయ్ తెలిపారు.
30 రోజుల పాటు మోదీ విజయాలను, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. గత 9 ఏళ్లలో బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు.
ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌కు కేసీఆర్ నిధులు సమకూర్చారని బండి సంజయ్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదని.. అక్కడ బీజేపీ ఓటు శాతం తగ్గలేదని పేర్కొన్నారు.