మాఫియా​ వ్యక్తుల చేతల్లో బాలీవుడ్​ : కంగన

-

యువ నటుడు సుశాంత్ సింగ్​ ఆత్మహత్యతో బాలీవుడ్​లోని బంధుప్రీతి అంశం చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరోసారి ఇదే విషయం గురించి మాట్లాడిన నటి కంగనా రనౌత్.. మాఫియాలో మిగిలిపోయిన కొంతమంది వ్యక్తుల కనుసన్నల్లోనే హిందీ చిత్రసీమ నడుస్తోందని ఆరోపించింది. ‘కాఫీ విత్​ కరణ్’ లాంటి అమసర్థ షోలతో ఇండస్ట్రీ నిండిపోయిందని తెలిపింది. విధేయత, విద్యా నేపథ్యం లాంటి నైతిక విలువలు ఉన్న వ్యక్తులు బాలీవుడ్​ నుంచి ఎలిమినేట్​ అవుతారని డా.సుబ్రహ్మణ్య స్వామి ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కంగన స్పందిస్తూ ఈ ట్వీట్​ చేసింది.

Kangana
Kangana

ఈ మధ్యన నెపోటిజమ్​పై బాలీవుడ్​ నటి కరీనా కపూర్​ చేసిన వ్యాఖ్యలపై.. కంగనా రనౌత్ సోషల్​ మీడియా టీమ్​ విరుచుకుపడింది. ఇండస్ట్రీలో కరీన విజయానికి అర్హురాలు కాదని ఆరోపించింది. స్టార్ వారసులు పలుకుబడితోనే చిత్రసీమలో రాణిస్తున్నారని పేర్కొంది.ఈ విషయాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేయొద్దని నెపోటిజం వారసులను ఉద్దేశించి కంగన టీమ్​ హెచ్చరించింది. “మీ అధికారాలతో మాకు ఎటువంటి సమస్య లేదు. మీరు ప్రవర్తించే విధానంతోనే సమస్యంతా. మీ మాఫియా వల్లే సుశాంత్​ చనిపోయాడు” అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news