పసుపు పత్రికల వార్త అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నారట!

-

ఈనాడు.. ఆంధ్రజ్యోతి పత్రికల్లో రెండు కథనాలు వచ్చాయి. అవేమిటంటే… అచ్చెన్నాయుడికి కరోనా సోకిందని! అవును.. “మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.” అని రాసుకొచ్చారు! దీంతో… అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!

అచ్చెన్నకు ఆపరేషన్ అయ్యిందన్న సంగతి తెలిసిందే. అనంతరం మరోసారి కూడా ఆపరేషన్ చేయడంతో సుమారు వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉండాలని.. అచ్చెన్న తరుపు న్యాయవాది కోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు సానుకూలంగా స్పందించింది. ఫలితంగా అచ్చెన్నా సుమారు 40 రోజులుగా ర‌మేశ్ ఆస్ప‌త్రిలో పైల్స్‌ కు ట్రీట్‌ మెంట్ తీసుకుంటున్నారు. ఇన్ని రోజులా అనే విషయం కాస్త ఆశ్చర్యం కలిగించేదైనప్పటికీ.. పాపం అచ్చెన్న పూర్తిగా కోలుకోవాలి కదా!!

ఈసమయంలో అచ్చెన్నాకు కరోనా అని రాసుకొచ్చాయి ఆ రెండు పత్రికలు! అయితే… ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా నిర్ధారించినట్లు లేదు! ఎందుకంటే… ప్రస్తుతం అచ్చెన్నా జ్యుడిషైయల్ రిమాండ్ లో ఉన్నారు! దీంతో… అనవసరంగా ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నారు… అదేదో జైల్లో ఉన్నా సరిపోయేది.. కరోనా రాకుండా ఉండేది. ఒకవేళ జైల్లో ఉన్నప్పుడు వచ్చిఉంటే… ఆ నేరం ప్రభుత్వంపై వేసి కాసేపు రాజకీయ నాటకాలు ఆడుకునే అవకాశం వచ్చి ఉండేది అని తమ్ముళ్లు ఫీలవుతున్నారంట.

వారి రాజకీయ అవసరాలు ఎత్తుగడల సంగతి అలా ఉంచితే… అచ్చెన్న క‌రొనా బారిన ప‌డ‌కూడ‌ద‌ని అంతా కోరుకుంటున్నారు. అచ్చెన్న‌కు క‌రోనా నెగిటివ్ అని వినాలని ఆశపడుతున్నారు. ఈ విషయంలో అచ్చెన్నా అభిమానుల ఆవేదనను ఏపీ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని… అచ్చెన్నకు కరోనా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫలితంగా పసుపు పత్రికల్లో వచ్చిన వార్త నిజం కాకూడదని ప్రార్థిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news