తెలుగు కళామతల్లికి పరిచయం కాబోతున్న కన్నడ సుప్రీం హీరో తనయుడు

-

వారసత్వం అనేది అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమా ఇండస్ట్రీ ల్లో చాలా కామన్ వ్యవహారమే అని చెప్పాలి. ఈ వారసత్వం గురించి మాట్లాడుకుంటూ పొతే టైమ్ కుడా సరిపోదు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం అన్న తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ లో కూడా ఈ వారసత్వం అనేది కొనసాగుతూ పోతుంది. తెలుగు లో మెగా వారసులు,కన్నడ లో రాజ్ కుమార్ తనయులు,మలయాళం లో ముమ్ముట్టి,మోహన్ లాల్ కుమారులు, అలానే తమిళ్ లో కూడా వారసులు తమ టాలెంట్ తో సినీ కళామతల్లికి ఏలుకుంటూ పోతున్నారు. అయితే ఎవరైనా కూడా తమ డెబ్యూ మూవీ సొంత భాషా చిత్రమే కావాలని అనుకుంటారు. అయితే కన్నడ సుప్రీం హీరో శశికుమార్ మాత్రం తన తనయుడి డెబ్యూ మూవీ అటు మాతృభాష కన్నడ అలానే తెలుగు లో కూడా తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలనీ భావిస్తున్నాడు. దీనితో ‘సీతాయాణం’ అనే చిత్రం తో అటు కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ను పరిచయం చేయబోతున్నారు. కన్నడ సుప్రీం హీరో అయిన శశికుమార్ తెలుగు,తమిళం లో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన వారసత్వంగా ఆయన కుమారుడు అక్షిత్ శశికుమార్ ను వెండితెరకు పరిచయం చేయనున్నారు.

అయితే ఆయన కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా తన కుమారుడిని పరిచయం చేయాలని రెండు భాషల్లో ఈ చిత్రం ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేయగా, ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించారు. ఇంకా ఈ చిత్రంలో అనహిత భూషణ్ కథానాయికగా నటిస్తుంది. రోహన్ భరద్వాజ్ సమర్పణలో కలర్ క్లౌడ్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version