మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ ఇండియా 2018

-

ఒక్క సినిమా యువ హీరో క్రేజ్ అమాంతం పెంచేసింది. అతనెవరో కాదు కన్నడ స్టార్ యశ్. మొన్నటిదాకా కన్నడలో హిట్లు కొడుతూ అక్కడ స్టార్ క్రేజ్ దక్కించుకున్న యశ్ కె.జి.ఎఫ్ సినిమాతో టోటల్ ఇండియానే షేక్ చేశాడు. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా కె.జి.ఎఫ్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో 2018 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ ఇండియాలో నెంబర్ 1 గా నిలిచాడు.

స్టార్ హీరోలు మాత్రమే పోటీ పడే ఈ స్థానంలో కె.జి.ఎఫ్ ఒక్క సినిమాతో కన్నడ స్టార్ యశ్ ఈ క్రేజ్ దక్కించుకున్నాడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఇచ్చిన ప్రోత్సాహంతో చాప్టర్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ స్టార్స్ సైతం ఉంటారని తెలుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కె.జి.ఎఫ్ సంచలనాలు సృష్టించగా భారీ అంచనాలతో వస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version