ఐక్యరాజ్యసమితి వేదికపై అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న కాంతారా..

కన్నడ సినిమా కాంతారకు అరుదైన గౌరవం లభించనుంది. స్విజర్లాండ్ లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో కాంతారా స్క్రీనింగ్ కానుంది. ఈ విషయాన్ని రిషభ్ శెట్టి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ స్ట్రీమింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చినా కాంతారా సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఆర్ఆర్అర్, కె.జి.ఎఫ్ 2 లతో సమానంగా సంచలనం సృష్టించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు అందకుండా రికార్డులు బద్దలు కొట్టింది. కర్ణాటకలో సంస్కృతిని ప్రతిబింబించేలా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలించిందని చెప్పాలి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తాజాగా మరొక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితిలో కాంతార చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. స్విట్జర్లాండ్ లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో కాంతారా స్క్రీనింగ్ జరగనుంది. ఈ స్క్రీనింగ్ అనంతరం రిషిప్ శెట్టి ప్రసంగించాను ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఎలా భాగం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ వంటి అంశాలకు సంబంధించిన విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది.