రిలీజ్ కి రెడీ అవుతున్న కపిల్ దేవ్ బయోపిక్ “83 ది ఫిల్మ్” ..!

-

ప్రస్తుతం మన సౌత్ అండ్ నార్త్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్స్ కి విపరీతమైన క్రేజ్ నెలకొంది. జోనర్ ఏదైనప్పటికి మేకర్స్ భారీ బడ్జెట్ ని కేటాయించి మరీ నిర్మిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకులనుండి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. భారీ వసూళ్ళను సాధిస్తున్నాయి. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నిర్మించ్ నటించిన దంగల్ నుండి మన దగ్గర వచ్చిన మహానటి సినిమా వరకు బయోపిక్స్ దాదాపు సూపర్ హిట్స్ ని సాధిస్తున్నాయి.

 

ఇప్పుడు అలాంటి మరో బయోపిక్ తెరకెక్కుతుంది. మన భారతీయులకు ఎంతో ఇష్టమైన క్రికెటటర్ కపిల్ దేవ్. మన ఇండియన్ క్రికెట్ టీం కు మొట్టమొదటి సారి ప్రపంచ కప్ ను అందించిన సారధి కపిల్ దేవ్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జీవిత చరిత్రపై సినిమాని రూపొందిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా “83 ది ఫిల్మ్” టైటిల్ తో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కపిల్ పాత్ర పోషిస్తుండగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే లీడ్ రోల్ లో నటిస్తుంది. క్రికెటర్ శ్రీకాంత్ రోల్ లో జీవా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ తీసేయగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రముఖ బ్యాట్‌మెంటన్ సైనా నెహ్వాల్ బయోపిక్ ని రూపొందిస్తున్నారు. ఈ బయోపిక్ లో పరిణితి చోప్రా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news