కరణ్ అర్జున్ మూవీ రివ్యూ.. ఆసక్తికర ట్విస్టులతో సినిమా కథ..జనాలు ఏమన్నారంటే?

-

చిత్రం: కరణ్
విడుదల తేదీ: 24 జూన్ 2022
నటీనటులు : అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా , మాస్ట‌ర్ సునీత్ , అనితా చౌదరి, రఘు . జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు..
మ్యూజిక్ : రోషన్ సాలూర్
కొరియోగ్రఫీ : రవి మేకల
నిర్మాత: డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల,సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్
డైరెక్టర్ : మోహన్ శ్రీవత్స

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`.ఈ చిత్రానికి ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా 186 థియేటర్స్ లలో విడుదల అయ్యింది..ఆ సినిమా ఎలా ఉంది, పబ్లిక్ టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కథ, విశ్లేషణ..

హీరో కరణ్ ఒక అనాధ శరణాలయం లో పెరుగుతాడు.అతన్ని దత్తత తీసుకోవాలని అనితా చౌదరి, రఘు అనాదాశ్రమానికి వచ్చి కరణ్ ను తీసుకెళ్లే టైంలో తమ్మునికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ కాల్ రావడంతో రిటర్న్ వెళతారు. అప్పటి నుండి అమ్మ కోసం ఎదురు చూస్తుంటాడు కరణ్..కానీ అనితా చౌదరి రాకుండా భర్త వచ్చి కరణ్ ను తీసుకెళ్ళి బాగా చదిస్తాడు. ఆ తరువాత వృషాలితో పెళ్లి ఫిక్స్ చేయడంతో తనకి కాబోయే భార్య వృషాలి తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్ లో వున్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు..అక్కడ ఓ వ్యక్తి వీరిద్దరిని చంపాలని అనుకుంటారు. మొత్తానికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అర్జున్ కు తెలియకుండా అక్కడ స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ హెల్ప్ అడుగుతుంది వృషాలి. ఈ క్రమంలో ఆ డ్రైవర్ అర్జున్ ను కొట్టి డ్రైవర్, క్లీనర్ కలసి వృషాలిని ఎత్తుకుపోయి రేప్ చేయాలి అనుకున్న టైంలో అర్జున్ వచ్చి వారి బారి నుంచి వృశాలిని కాపాడుతాడు.అప్పటి నుండి చంపాలనుకున్న వృషాలీని అర్జున్ ఎందుకు కాపాడాడు? వృషాలిని పెళ్లి చేసుకువాలను కున్న కరణ్ ను అర్జున్ ఎందుకు బందించాడు..అసలు సినిమా కథ తెలియాలంటే సినిమా మొత్తాన్ని చూడాలి..

దర్శకుడు మోహన్ శ్రీవత్స మహాభారతం లోని కర్ణుడు , అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టు మలుస్తూ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకేక్కించాడు..ఒకరు అమ్మ కోసం పరితపిస్తూ ఉంటే, మరొకరు అమ్మాయి ప్రేమ కోసం ఆరాట పడతారు..మొత్తానికి క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా చూపించారు.హీరోయిన్ షిఫా కూడా తన అందం అభినయంతో తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి . తల్లి పాత్రలో నటించిన సునీత చౌదరి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన పాత్ర పరిధి మేరకు నటించింది.మిగిలిన వారంతా కూడా ఎవరికీ వారే అన్నట్లు నటించారు..బ్యాక్ గ్రౌండ్ మ్యుజిక్ సినిమాకు బ్యాక్ బోన్ అయ్యింది.అందరూ చూసే సినిమా..ఓవరాల్ గా…మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కరణ్ సినిమా బాగానే ఆకట్టుకుంది..

రేటింగ్  : 3/5

Read more RELATED
Recommended to you

Latest news