బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి..!

-

ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల ద్వారా అందుకున్న క్రేజ్ కెరియర్ పతనమవుతున్న సమయంలో బిగ్ బాస్ షో లో పాల్గొని.. ఆ తర్వాత సోషల్ మీడియా కాంట్రవర్సీ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రసారం కాగా ఈ షో పై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ షో ని ఆపాలని చాలామంది కామెంట్లు చేస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ వల్ల మంచి ఉంది చెడు కూడా ఉంది.

ముఖ్యంగా బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక అందరూ కూడా ఖాళీ అయిపోతారు. ఎందుకంటే వాళ్లు ఆరు నెలలు అవకాశాలు రాకుండా ఆపేస్తారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు వస్తాయని అందరూ అనుకుంటారు కానీ ఆరు నెలల తర్వాత వాళ్లను వీళ్లను అందరూ మర్చిపోతున్నారు. ఇక తర్వాత ఈ సెలబ్రిటీలకు ఉన్న అవకాశాలు కూడా ఆగిపోతాయి. కాబట్టి బిగ్బాస్ కి వెళ్లకపోవడమే మంచిది. మేము వెళ్లొచ్చాము కాబట్టే ఆ పరిస్థితులు మాకు తెలుసు.

బిగ్బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే దానిని అలాగే చూడాలి. ఈ ప్లాట్ఫారం ద్వారా ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకి వస్తే మంచిదే కదా. ఆ క్రేజ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అయితే బిగ్ బాస్ రాకముందు ముందు నుంచి కూడా నా క్రేజ్ అలాగే ఉంది అయితే ఇప్పుడు అవకాశం వస్తే మాత్రం మళ్లీ వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కామెంట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version