నీ ముఖం మాడిపోను అంటున్న క‌రణ్ జోహార్‌!

-

బాలీవుడ్‌లో స్టార్ నిర్మాత‌గా దూసుకుపోతున్నాడు క‌రణ్ జోహార్‌. ఎంత పెద్ద సినిమా అయినా దాని వెన‌క క‌ర‌ణ్ జోహార్ హ‌స్తం ఉడాల్సిందే. అంతే కాదు ఆయ‌న మంచి స్టైల్స్‌ను ఫాలో అవుతుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చిన ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ యంగ్ స్టార్స్‌కు స‌వాల్ విసురుతుంటారు. అయితే స్టైల్‌ను ఫాలో అయ్యే క్ర‌మంలోనే క‌ర‌ణ్ తాజాగా ఓ లుక్ ఫాలో అయ్యాడు.

క‌రణ్ జోహార్‌
క‌రణ్ జోహార్‌

ఆయ‌న రెడ్ స్వెట్ షర్ట్ వేసుకుని ఫన్ జనరేట్ అయ్యేలా సెల్ఫీ తీసుకున్నాడు. కాగా ఈ ఫొటోను ఇన్ స్టాలో పోస్టు చేశాడు. కాగా దీనిపై తీవ్రంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి. ఇంత‌కుముందు దోస్తానా 2 అనే సినిమా నుంచి కార్తీక్ ఆర్యన్ ని తీసేయ‌డంతో ఆయ‌న అభిమానులు కరణ్ ఆటాడేసుకుంటున్నారు.

కాగా త‌ను వేసుకున్న టీ షర్ట్ మీద బురి నజర్ వాలే తేరా మూ కాలా అనే హిందీ కామెంట్ ఇచ్చాడు క‌ర‌ణ్‌. నార్మ‌ల్‌గా అయితే ఇంగ్లీషు లో క్యాప్ష‌న్ ఉండాలి.. కానీ కరణ్ మాత్రం దాన్ని హిందీ ప‌దాల‌నే ఇంగ్లీషు లో ప్రింట్ వేయించాడు. దానికి తెలుగులో అర్థం నన్ను చూసి ఏడ్చే నీ ముఖం మాడిపోను అని వ‌స్తుంది. కాగా త‌న ఫొటోల‌ను ట్రోల్ చేసే వారికి క‌ర‌ణ్ స‌మాధానం అది అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news