కార్తీకదీపం ఫేమ్ దీప అలియాస్ వంటలక్క భర్త ఎవరో తెలుసా..!

-

స్టార్ మా చానల్ లో ప్రసారమయే కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని వారు బహుశా ఉండరేమో. రాత్రి ఏడున్నర సమయం అయిందంటే ఇంటిల్లి పాది వచ్చి టీవీలకి అతుక్కుపోతారు. అంతగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది కార్తీకదీపం సీరియ‌ల్‌. ఈ క్ర‌మంలోనే ప్రస్తుతం సీరియల్స్ అన్నింటిని వెనుకకి నెట్టేసి టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక కార్తీకదీపం సీరియల్ లోని దీప అలియాస్ వంటలక్క అంటే ఇష్టపడని వారూ ఉండ‌రు. సీరియల్ లో తన నటనతో కన్నీళ్లు పెట్టించే దీపకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఉన్న దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్.

స్వతహాగా మలయాళీ అయిన ప్రేమి అతి కొద్దికాలంలోనే తెలుగు నేర్చుకొని అచ్చ తెలుగు అమ్మాయిగా మారిపోయింది. నటనపైన ఉన్న ఆసక్తితో అక్కడ కొన్ని సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కొన్ని సంవత్సరాల కింద ప్రేమి విశ్వనాధ్ వినీత్ భట్ ని వివాహం చేసుకుంది. వినీత్ భట్ కేరళలోని గొప్ప జ్యోతిష్యుడుగా పేరు సంపాదించుకున్నారు. బెస్ట్ ఆస్ట్రాలేజర్ ఆఫ్ ది వరల్డ్ అనే అవార్డు అందుకున్నారు. ఇక ప్రేమికి భర్త ప్రోత్సాహం కూడా ఉండడంతో తన ఫ్యాషన్ ని కెరియర్ గా మలుచుకొని మంచి నటిగా కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news