గుడ్ న్యూస్‌: చదువు లేకున్నా.. డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు..

-

విద్యార్హత లేక డ్రైవర్లుగా కూడా నిలదొక్కులేక పోతున్న వారికిదో శుభవార్త! చదువు లేకపోయినా డ్రైవింగ్‌ బాగా వచ్చిన వ్యక్తికి డ్రైవర్‌గా లైసెన్స్‌ ఇస్తే తప్పులేదని కేంద్రం భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొత్త మోటారు వాహనాల చట్టంలో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందడం లేదా పునరుద్దరించడంలో పలు మార్పులు తీసుకొచ్చింది. టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు జారీ చేసే లైసెన్స్ చెల్లుబాటు వారి వయసుపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత ఒక నెల గ్రేస్ పీరియడ్ నిబంధనను కూడా కేంద్రం రద్దు చేసిందన్న విషయం తెలిసిందే.

ఇక అటు రవాణా వాహనాలు నడపడానికి లైసెన్స్ గడువు 5 సంవత్సరాల వరకు ఉండగా.. ప్రమాదకరమైన వాహనాలకు 3 సంవత్సరాలు ఉంటుంది. వీరికి లైసెన్స్ గడువు ముగియడానికి ఏడాదికి ముందే రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు సవరించిన చట్టం ప్రకారం ఆటో, కారు, బస్, లారీ వంటి రవాణా వాహనాన్ని నడపడానికి, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఇక నుండి ఎటువంటి విద్యార్హత అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news