రాజమౌళి కోడలు ఎవరో తెలుసా.. స్టార్ హీరో అన్న కూతురే..!

-

డైరక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ వెడ్డింగ్ ఈరోజు జైపూర్ లో ఘనంగా జరుగుతుంది. దాదాపు టాలీవుడ్ స్టార్స్ అంతా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. స్టార్ అటెండన్స్ తో కార్తికేయ పెళ్లి సూపర్ ఎట్రాక్షన్ గా మారింది. బాహుబలితో రాజమౌళి నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు కాబట్టి కార్తికేయ మ్యారేజ్ పై కూడా నేషనల్ కవరేజ్ ఉంది.

ఇదిలాఉంటే అసలు రాజమౌళి కోడలుగా వచ్చే అమ్మాయి ఎవరు.. ఆమె ఎవరి కూతురు అని తెలుసుకోవాలని ఉంటుంది. అయితే ఈ విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. రాజమౌళికి కోడలిగా వస్తున్న అమ్మాయి పేరు పూజా ప్రసాద్. ఆమె డివోషనల్ సింగర్. భక్తిగీతాలు పాడుతూ ఉండే పూజా ప్రసాద్ కార్తికేయతో పెళ్లికి సిద్ధమైంది. కార్తికేయ, పూజా ప్రసాద్ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడగా వీరి పెళ్లికి పెద్దల అంగీకారం లభించింది. కార్తికేయ, పూజా ప్రసాద్ 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది.

పూజా ప్రసాద్ ఎవరో కాదు తెలుగు స్టార్ హీరో కమ్ విలన్ జగపతి బాబు అన్న కూతురే. జగపతి బాబు సోదరుడు రాం ప్రసాద్ కుమార్ కూతురు పూజా ప్రసాద్. సో రాజమౌళి జగపతి బాబుకి వియ్యంకుడు అవుతున్నాడన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news