మహేష్ సరసన కత్రినా కైఫ్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న మహర్షి ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయే సుకుమార్ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారట.

తెలుగు వాళ్లకు కత్రినా తెలిసిన హీరోయినే.. వెంకటేష్ తో మళ్లీశ్వరి, బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాల్లో నటించింది కత్రినా కైఫ్. బాలీవుడ్ లో కెరియర్ కాస్త వెనుకపడ్డట్టు అనిపించినా తన అందచందాలతో అలరిస్తున్న ఈ అమ్మడు సౌత్ లో సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే సుకుమార్ కత్రినాను కలవడం జరిగిందట. ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

మహేష్, కత్రినా ఈ క్రేజీ కాంబినేషన్ కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఘట్టమనేని ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాతో కూడా మరోసారి ఇండస్ట్రీ రికార్డులు కొట్టాలని చూస్తునాడు సుకుమార్.