కీరవాణి ఆస్కార్ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం..!!

-

ఏ ముహర్తాన రాజమౌళి RRR స్టార్ట్ చేశాడో కాని ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలకు  లోటు లేదు. సర్ప్రైజ్ ప్యాక్ లాగా  రాజమౌళి ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది.

ఇప్పుడు నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు రేసులో షార్ట్ లిస్ట్ కు ఎంపిక అయ్యింది. ప్రపంచంలో ప్రతిష్టాతకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో RRR అవార్డు తెస్తుందని భావిస్తున్నారు. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా సంగీత దర్శకుడు కీరవాణి కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ప్రకటించింది. అలాగే 2022 ఫ్యాన్స్ ఫేవరెట్ చిత్రంగా గోల్డెన్ టొమాటో అవార్డు ను ఆర్ఆర్ఆర్ సినిమా సొంతం చేసుకుంది.

ఇక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం తెలుగు సినిమా ప్రేక్షకుల తో పాటు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫంక్షన్  మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో  అత్యంత అట్టహాసంగా జరగబోతోంది. ఇందులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ భారీ స్థాయిలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ ఆస్కార్ అవార్డుల వేడుకల సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి ని ఒక లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వమని చెప్పినట్లు సమాచారం అందిందని తెలుస్తోంది. గతంలో ఏ ఆర్ రెహమాన్ కూడా ఆస్కార్ స్టేజ్ మీద  పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక కీరవాణి కూడా అలాగే పెర్ఫార్మెన్స్ ఇచ్చి అవార్డు అందుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news