ట్రిపుల్ ఆర్ సీక్రెట్ విప్పిన కీరవాణి

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా అందులో ఏది నిజం అన్నది క్లారిటీ లేదు. ఎన్.టి.అర్, చరణ్ లతో రాజమౌళి ఓ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడన్న న్యూస్ వైరల్ అయ్యింది. 1930 కాలం నాటి కథతో రాజమౌళి ఈ సినిమా చేస్తున్నాడని గట్టి టాక్. ఇక ఆ విషయాన్నే కన్ఫాం చేస్తూ కీరవాణి మాటలు ఉండటం విశేషం.

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు మ్యూజిక్ అందించిన కీరవాణి ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ట్రిపుల్ ఆర్ సీక్రెట్ విప్పేశాడు. మార్చి నుండి ఆ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయాలని.. రెండు కాలాలకు సంబందించిన ట్యూన్స్ చేయాల్సిందిగా చెప్పాడు కీరవాణి. సో ముందునుండి వినపడుతున్న 1930, 2019 స్టోరీగా ట్రిపుల్ ఆర్ వస్తుందన్నమాట.

ఆల్రెడీ రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా గతజన్మల కథగానే వచ్చింది. అయితే ట్రుపుల్ కు మగధీరకు చాలా వ్యత్యాసం ఉండబోతుందని తెలుస్తుంది. బాహుబలిని మించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.