జీరో ప్యాక్‌ కీర్తి సురేష్‌కు కలిసిరాలేదా

-

రకుల్ కాస్త వెయిట్ తగ్గినా… తమన్నా స్లిమ్ అయినా.. చెప్పుకోవడానికి ఏమీ వుండదు. సన్నగా వున్నవాళ్లు మరింతగా సన్నబడితే లైట్‌గా తీసుకుంటారు ఆడియన్స్. కానీ.. బొద్దుగా వున్నవాళ్లు బక్కగా అయితే.. ఆడియన్స్‌ ఒప్పుకోరు. కీర్తి సురేష్‌ విషయంలో ఇదే జరిగింది. కీర్తిసురేష్‌ వెయిట్ భారీగా తగ్గింది. ఎంతలా అంటే.. మహానటిలో సావిత్రిగా నటించింది ఈ అమ్మడే అంటే నమ్మబుద్దికానంతగా.

జీరో ప్యాక్‌లకు దూరంగా వండే కీర్తి సురేష్‌ మహానటి తర్వాత మిస్‌ ఇండియా మూవీ కోసం.. వున్నట్టుండి సన్నగా .. నాజూగ్గా మారిపోయింది. సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు.. మిస్‌ ఇండియా.. గుడ్‌ లక్‌ సఖి విజువల్స్‌ ఫ్యాన్స్‌కే నచ్చలేదు. నేను శైలజ.. మహానటిలో చూసింది ఈ అమ్మడినేనా? అన్నట్టు షాక్‌ ఇచ్చేలా సన్నబడింది కీర్తి.

మొదట్నుంచీ కాస్త బొద్దుగా కనిపించే హీరోయిన్ కీర్తి సురేష్. హిట్స్ వచ్చినా.. ఫ్లాప్ వచ్చినా.. ఒకేరకమైన ఫిజిక్ మెయిన్‌టేన్ చేస్తూ.. వరుస సినిమాలు చేసింది. మహానటి అంటే కీర్తి సురేషే అన్నంతగా అభినయంతో ఇంప్రెస్ చేసింది. వెయిట్ తగ్గిన తర్వాత నటించిన మిస్‌ ఇండియా ఫ్లాప్‌ అయింది. ఆడియన్స్ ఈ జీరో సైజ్‌ను రిసీవ్ చేసుకోలేకపోయారు.

జీరో ప్యాక్‌ కీర్తి సురేష్‌కు కలిసిరాలేదు. దీంతో.. మళ్లీ వెయిట్‌ పెరిగే పనిలో వుంది కీర్తి. మిస్‌ ఇండియా మూవీ రిలీజ్‌ సందర్భంగా ట్విట్టర్‌లో చిట్‌చాట్‌ చేసింది. ఈ సందర్భంగా నేను శైలజలో కీర్తిలా ఎప్పుడు మారతావని ఓ అభిమాని అడిగితే.. కమింగ్‌ సూన్‌ అంటూ సమాధానం ఇచ్చింది. ఈలెక్కన సర్కారువారి పాటలో కీర్తి మళ్లీ బొద్దుగా మారే అవకాశం వుంది. పోయిన వెయిట్‌తోపాటు.. క్రేజ్‌ను కూడా మళ్లీ సంపాదించే పనిలో వుంది కీర్తి.

Read more RELATED
Recommended to you

Latest news