బాలీవుడ్‌కు కీర్తి సురేష్..ఆ హీరోతోనే సినిమా ?

-

అలనాటి మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన అందాల నటి కీర్తి సురేశ్. ‘మహానటి’ ఫిల్మ్ తో నేషనల్ అవార్డు పొందిన ఈ సుందరి..తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతీ విషయాన్ని ఎప్పడికప్పుడు షేర్ చేస్తుంటుంది ఈ ముద్దు గుమ్మ.

అయితే.. ఈ హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అట్లీ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీలో హీరోయిన్గా నటించడానికి కీర్తిని సంప్రదించినట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే అజయ్ దేవ్ గన్ మూవీ మైదాన్ లో కీర్తికి ఛాన్స్ వచ్చినా… అనుకోకుండా ఆ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రలో ప్రియమణి నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news