కీర్తి అక్కడ కుమ్మేస్తుంది

-

మళయాళ భామలకు ఇప్పుడు సౌత్ సినిమాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. వారిలో ముఖ్యంగా కీర్తి సురేష్ వరుస అవకాశాలను అందుకుంటుంది. తనదైన అభినయంతో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ మహానటి సినిమాతో మరో మెట్టు ఎక్కేసిందని చెప్పొచ్చు. నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాల తర్వాత తెలుగులో మరే సినిమా సైన్ చేయని కీర్తి సురేష్ కోలీవుడ్ లో మాత్రం వరుస ఛాన్సులు పట్టేస్తుంది.

తెలుగులో ఈమధ్యనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని మొదలు పెట్టిన కీర్తి సురేష్ తమిళంలో స్టార్ సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే సూర్య, విజయ్ లతో కలిసి నటించిన కీర్తి సురేష్ లేటెస్ట్ గా రజిని సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. మురుగదాస్ డైరక్షన్ లో ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా విజయ్ అత్లీ డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది. ఈరోజు ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట. విజయ్ తో ఆల్రెడీ సర్కార్ సినిమాలో జతకట్టిన కీర్తి సురేష్ మరోసారి జోడీ కడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news